అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
- October 24, 2026
న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు.ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి, విభజన హామీలు, ఆర్థిక నిధుల విడుదలతో పాటు పలు ఆసక్తికర అంశాల పై విస్తృతంగా చర్చించారు.
రాజధాని, పోలవరం, నిధుల పై విజ్ఞప్తి
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగతి పథంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందాలని చంద్రబాబు కోరారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన సహాయం చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రానికి అందాల్సిన వివిధ ఆర్థిక నిధులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న విభజన హామీల సత్వర అమలుపై కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
శాంతిభద్రతలు, తాజా రాజకీయ పరిణామాల పై చర్చ
కేవలం అభివృద్ధి, నిధుల అంశాలే కాకుండా.. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా ఇరువురి నేతల మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
తర్వాతి భేటీ కేంద్ర రైల్వే మంత్రితో..
అమిత్ షాతో భేటీ ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే ప్రాజెక్టులు, పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల విస్తరణతో పాటు రాజధాని అమరావతికి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
- రస్ అల్ ఖైమాలో అన్ని బీచ్‌లు మూసివేత.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు
- ఏపీకి వాయుగుండం ముప్పు.. IMD హెచ్చరిక
- ఫ్రెంచ్ ఓపెన్ ఫైనలు పీవీ సింధు
- యూఏఈలో పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు..
- బహ్రెయిన్‌లో క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఊరట..!!
- ఒమన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ.. వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్..!!
- కువైట్‌లో నవంబర్ 6న సైన్స్ ఫెయిర్..ఉచిత ప్రవేశం..!
- ఖతార్‌లో డిజిటల్ వ్యాపారులకు గుడ్ న్యూస్..!!
- గాల్లోనే రెండు విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి!







