ఖతార్‌లో దోమల నివారణకు మార్గదర్శకాలు జారీ..!!

- October 25, 2026 , by Maagulf
ఖతార్‌లో దోమల నివారణకు మార్గదర్శకాలు జారీ..!!

దోహా: ఖతార్‌లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ‘వర్షం తర్వాత మీరు ఏం చేయాలి?’ అనే శీర్షికతో విడుదల చేసిన ఇన్ఫోగ్రాఫిక్‌లో నీరు సక్రమంగా బయటకు వెళ్లేలా చూడాలని, నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, పరిసరాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది.

అదే సమయంలో అవసరమైతే కీటకాలు, ఎలుకల నియంత్రణ సేవల కోసం OUN యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది. దోమల వ్యాప్తిని అరికట్టి, పరిసరాలను సురక్షితంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com