దోహా మెట్రో బస్సు రూట్లలో మార్పులు..!!

- October 25, 2026 , by Maagulf
దోహా మెట్రో బస్సు రూట్లలో మార్పులు..!!

దోహా: ఖతార్‌లోని దోహా మెట్రో రెడ్ లైన్ పరిధిలో నడిచే మెట్రోలింక్, మెట్రోఎక్స్‌ప్రెస్ సేవలకు సంబంధించి కొత్త రూట్లను ప్రకటించారు. అల్ ఖస్సార్ నుంచి ముషెరీబ్ మెట్రో స్టేషన్ల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ మార్పులు వర్తించనున్నాయి. నేటి నుంచి కొత్త రూట్లు అమల్లోకి వచ్చాయి.

M103 బస్సు రూటులో మార్పు

M103 మెట్రోలింక్ బస్సు ముషెరీబ్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ స్టేషన్ ముషెరీబ్ మెట్రో స్టేషన్‌లోని ఎగ్జిట్ 1 పక్కనే ఉంటుంది. ఈ బస్సు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి అందుబాటులో ఉంటుంది. అల్ మామౌరా ఏరియా 43కు సేవలు అందిస్తూ, అల్ సూడాన్ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంది.

M119 బస్సు రూటులో మార్పు

M119 బస్సు ఇకపై అల్ ఖస్సార్ మెట్రో స్టేషన్‌లోని ఎగ్జిట్ 1 నుంచి బయలుదేరుతుంది. ఈ రూటు ద్వారా ఉమ్ లేఖ్బా ప్రాంతానికి రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఈ బస్సు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి నడుస్తుంది.

ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని రెడ్ లైన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com