బహ్రెయిన్‌లో భారీ డ్రగ్స్ పట్టివేత..!
- October 26, 2026
మనామా: బహ్రెయిన్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా మూడు వేర్వేరు కేసుల్లో మొత్తం ఆరుగురు ఆసియా దేశస్థులను అరెస్ట్ చేశారు. వారి నుంచి BD27,000కు పైగా విలువైన మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బహ్రెయిన్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ పరిధిలోని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ ఈ ఆపరేషన్లు నిర్వహించింది.
మొదట అందిన సమాచారం ఆధారంగా అధికారులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చినట్లు అనుమానిస్తున్న నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం మూడు కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు. ఈ కేసులకు సంబంధించి తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగనున్నాయి.
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని బహ్రెయిన్ జనరల్ డైరెక్టరేట్ కోరింది. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే హాట్‌లైన్: 996, ఈమెయిల్: [email protected] ద్వారా అధికారులకు తెలియజేయవచ్చని సూచించింది. సమాచారం అందించే వారి వివరాలను పూర్తి గోప్యతతో నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో నివాసితులకు గుడ్‌న్యూస్..!
- సౌదీ అరేబియాలో కనీస వేతన పరిమితి పెంపు..!!
- మస్కట్‌లో ఇండియా–ఒమన్ ఆయుష్ కేంద్రం ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం..!!
- దుబాయ్‌లో వాహనదారులకు అలర్ట్..!!
- బహ్రెయిన్‌లో భారీ డ్రగ్స్ పట్టివేత..!
- బంగాళాఖాతంలో బీభత్సం..ఏపీకి భారీ వర్షాల ముప్పు!
- ఇజ్రాయెల్ ఎన్నికలకు అంతరాయం కలిగిస్తే తీవ్ర పరిణామాలు: ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక
- ఖతార్‌లో ఘనంగా తెలంగాణ వైభవం 2026.. బతుకమ్మతో సాంస్కృతిక సందడి
- సౌదీ అరేబియాలో డ్రోన్లు, క్షిపణుల కలకలం..







