కింగ్ ఫహద్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం..!!

- October 26, 2026 , by Maagulf
కింగ్ ఫహద్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం..!!

కువైట్‌: కింగ్ ఫహద్ రోడ్డుపై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. కింగ్ ఫహద్ రోడ్డుపై అల్‌ షుహదా ప్రాంతానికి ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న మిష్రెఫ్‌ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తదుపరి చట్టపరమైన, అధికారిక ప్రక్రియల కోసం ప్రమాద స్థలాన్ని సంబంధిత అధికారులు సీజ్ చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com