బహ్రెయిన్‌లో ‘ట్రీ వీక్’ నిర్వహించిన న్యూ ఇండియన్ స్కూల్..!!
- October 26, 2026
మనామా: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ప్రాముఖ్యతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు బహ్రెయిన్‌లోని న్యూ ఇండియన్ స్కూల్ ‘ట్రీ వీక్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో LKG నుంచి Grade 12 వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చెట్ల ప్రాముఖ్యత, అడవుల నరికివేత వల్ల కలిగే నష్టాలు, పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. 2030 నాటికి 3.6 మిలియన్ల చెట్లను నాటాలన్న బహ్రెయిన్ ప్రభుత్వ లక్ష్యానికి, గ్రీన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌కు మద్దతుగా పాఠశాల ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని స్కూల్ మేనేజ్మెంట్ తెలిపింది.
ఇదే సమయంలో వివిధ తరగతుల విద్యార్థుల కోసం పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
- LKG నుంచి Grade 3 వరకు: ‘ది లోరాక్స్’ కథ ఆధారంగా కథా కార్యక్రమాన్ని నిర్వహించారు.
- Grades 4 నుంచి 7 వరకు: పచ్చని ప్రదేశాలను పెంచాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ పోస్టర్ తయారీ పోటీ నిర్వహించారు.
- Grades 8 నుంచి 12 వరకు: అడవుల నరికివేత, వాతావరణ మార్పులు, కాలుష్యం, జీవవైవిధ్య నష్టం వంటి అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు.
విద్యార్థులు రూపొందించిన పోస్టర్ల ద్వారా పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు.
ట్రీ వీక్‌లో భాగంగా పాఠశాలలో ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలియజేశారు. స్టూడెంట్ కౌన్సిల్ రూపొందించిన అవగాహన వీడియోను కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘One Plant, One Promise’ (ఒక మొక్క.. ఒక ప్రతిజ్ఞ) పేరుతో విద్యార్థులు పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో కనీసం ఒక మొక్కను పెంచడంతో పాటు నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
తాజా వార్తలు
- ఆర్థిక సంబంధాల బలోపేతంపై కువైట్–భారత్ చర్చలు..!!
- సౌదీ అరేబియా రక్షణ రంగంలో కీలక పురోగతి..!!
- మస్కట్–ముంబై.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం..!!
- బహ్రెయిన్‌లో ‘ట్రీ వీక్’ నిర్వహించిన న్యూ ఇండియన్ స్కూల్..!!
- 2027లో సరికొత్తగా దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!
- ఖతార్‌లో ‘బైతి బైతక్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- రామమందిరానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. దర్శన వేళల్లో మార్పులు!
- రాష్ట్రపతి తో తెలంగాణ గవర్నర్ భేటీ
- దుబాయ్‌లో వింటర్ క్యాంపింగ్ సీజన్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం..
- హైదరాబాద్‌లో ముగ్గురు ఉజ్బెకిస్థాన్ మహిళల అరెస్ట్







