సౌదీ అరేబియా రక్షణ రంగంలో కీలక పురోగతి..!!

- October 26, 2026 , by Maagulf
సౌదీ అరేబియా రక్షణ రంగంలో కీలక పురోగతి..!!

రియాద్‌: సైనిక వ్యయంలో దేశీయ సంస్థల వాటాను పెంచుకోవడంలో సౌదీ అరేబియా గణనీయమైన పురోగతి సాధించింది. 2025 చివరి నాటికి సైనిక వ్యయ స్థానికీకరణ (Military Spending Localization) 27.30 శాతానికి చేరింది. ఇది వార్షిక లక్ష్యమైన 24 శాతం కంటే ఎక్కువని సౌదీ జనరల్ అథారిటీ ఫర్ మిలిటరీ ఇండస్ట్రీస్ (GAMI) మిలిటరీ ఇండస్ట్రీస్ ఫోరమ్‌లో ఈ గణాంకాలను వెల్లడించింది. 2024లో సౌదీ సైనిక వ్యయ స్థానికీకరణ 20 శాతంగా ఉండగా, 2025లో అది 27.30 శాతానికి పెరిగింది. దీంతో వార్షిక లక్ష్యాన్ని 3.30 శాతం పాయింట్ల మేర అధిగమించిందని తెలిపింది.

సైనిక వ్యయ స్థానికీకరణలో నమోదైన పురోగతి వివరాలు ఇలా ఉన్నాయి:

- 2018: 4 శాతం

- 2019: 6 శాతం

- 2020: 7 శాతం

- 2021: 9 శాతం

- 2022: 10 శాతం

- 2023: 15 శాతం

- 2024: 20 శాతం

- 2025: 27.30 శాతం

సైనిక వ్యయంలో దేశీయంగా ఉత్పత్తి చేసే వస్తువులు, సేవలు, స్థానిక పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నాలు ఈ పురోగతికి దోహదపడుతున్నాయని నివేదిక పేర్కొంది.

ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం

సైనిక వ్యయంలో స్థానిక భాగస్వామ్యం పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం కలుగుతోందని GAMI వెల్లడించింది. ఈ రంగం సౌదీ అరేబియా స్థూల దేశీయోత్పత్తి (GDP)కి SR7.468 బిలియన్లు తోడ్పడగా, ఉపాధి రంగానికి SR5.243 బిలియన్ల మేర సహకారం అందించినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. అలాగే, సైనిక వ్యయంలో స్థానిక కంటెంట్ వృద్ధి రేటు 40.91 శాతానికి చేరినట్లు సంస్థ తెలిపింది.

2030 నాటికి 50 శాతం లక్ష్యం

సైనిక వ్యయంలో స్థానికీకరణను మరింత పెంచేందుకు సౌదీ అరేబియా నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. 2030 నాటికి సైనిక వ్యయ స్థానికీకరణను 50 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా దేశీయ రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేయడం, స్థానిక సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం వంటి ప్రయోజనాలను సాధించాలని భావిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com