'సామి 2' లో త్రిష...

- August 27, 2016 , by Maagulf
'సామి 2' లో త్రిష...

 2003లో హరి దర్శకత్వంలో విక్రం హీరోగా నటించిన చిత్రం 'సామి'. పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా విక్రం నటించి మెప్పించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సూర్యతో 'సింగం 3' రూపొందిస్తున్న హరి ఆ సినిమా విడుదలయ్యాక.. విక్రంతో కలసి 'సామి 2'ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబరు నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇందులో ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. తొలి భాగంలో విక్రంకు జంటగా త్రిష నటించారు. ఇప్పుడు రెండో భాగంలో ఆమె నటించే అవకాశముందని తెలుస్తోంది. దీనిగురించి దర్శకుడు మాట్లాడుతూ 'సామి 2' సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించనున్నాం.

కథ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం చిత్రీకరణకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇందులో త్రిష ఉన్నారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచాం. మరో అగ్ర కథానాయిక ఇందులో నటించనున్నారు.

మొత్తానికి ఇద్దరు నాయికలు ఇందులో ఉంటారని చెప్పారు. ఈ రెండోనాయికగా నయనతార వద్ద సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com