షార్జా, రస్ అల్ ఖైమా బీచ్‌లలో సందర్శకుల సందడి..!!
- November 14, 2026
దుబాయ్: యూఏఈలోని షార్జా, రస్ అల్ ఖైమా బీచ్‌లు దాదాపు మూడు వారాల మూసివేత అనంతరం మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో కుటుంబాలు, ఈతప్రియులు, వ్యాయామం కోసం బీచ్‌లకు వెళ్లే స్థానికులు తిరిగి తమకు ఇష్టమైన సముద్ర తీరాలకు చేరుకుంటున్నారు. ఆఫ్‌షోర్ ప్రాంతంలో చమురు లీకేజీ కారణంగా విధించిన ఆంక్షలు తొలగించడంతో బీచ్‌ల సందడి మళ్లీ మొదలైంది. చల్లబడుతున్న వాతావరణంతో శీతాకాలంలో బీచ్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న కుటుంబాలకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. బీచ్‌లు మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పర్యాటక రంగానికి కూడా తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి. హోటళ్లలో బుకింగ్స్ క్రమంగా పెరుగుతున్నాయని పర్యాటక రంగ నిర్వాహకులు చెబుతున్నారు.
తిరిగి మొదలైన వ్యాయామాలు
రస్ అల్ ఖైమాకు చెందిన జాసిమ్ అల్ హమ్మామ్‌కు ఫ్లెమింగో బీచ్ తిరిగి తెరుచుకోవడం ఆనందాన్ని కలిగించింది. ఆయన వారానికి రెండు నుంచి మూడు సార్లు అక్కడికి వెళ్లి వాకింగ్, రన్నింగ్ చేస్తుంటారు. బీచ్‌లు మూసివేసిన సమయంలో జిమ్‌తో పాటు కార్నిష్ ప్రాంతంలో వ్యాయామం చేసినప్పటికీ సముద్ర తీరంలో లభించే అనుభూతి వేరని తెలిపారు. వాతావరణం ఆహ్లాదకరంగా మారుతున్న సమయంలో మళ్లీ బీచ్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. మెత్తటి ఇసుకపై పరుగెత్తడం, సముద్రం నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడం ప్రత్యేక అనుభూతినిస్తుందని పేర్కొన్నారు.
కుటుంబ విహారాలకు మళ్లీ అవకాశం
షార్జాలోని అల్ నహ్దా నివాసి అబ్దుల్ కలాం కూడా బీచ్‌లు తిరిగి తెరుచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శీతాకాలంలో వారాంతాల్లో వేలాది కుటుంబాలు షార్జా బీచ్‌లకు వస్తుంటాయని చెప్పారు. పిల్లలతో కలిసి ఆహారం తీసుకెళ్లి రోజంతా సముద్ర తీరంలో గడపడం, స్నేహితులు, బంధువులతో సరదాగా సమయం గడపడం ఇక్కడి కుటుంబాలకు అలవాటని తెలిపారు. బీచ్‌లు మూసివేయడంతో చాలామంది నిరాశకు గురయ్యారని, కొందరు ప్రత్యామ్నాయంగా ఎడారి ప్రాంతాలు, వాడీలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు బీచ్‌లు తిరిగి అందుబాటులోకి రావడంతో ఈ ఆదివారం కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు పలువురు వెల్లడించారు. ముఖ్యంగా పిల్లలు మళ్లీ సముద్ర తీరానికి వెళ్లేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
స్పోర్ట్స్ ఈవెంట్‌కు వచ్చిన కుటుంబానికి ఆనందం
షార్జాలో నివసిస్తున్న ఈజిప్టుకు చెందిన మోనికకు కూడా ఫ్లెమింగో బీచ్ సందర్శన ప్రత్యేక అనుభూతినిచ్చింది. యూఏఈ జాతీయ జట్టు తరఫున క్రీడా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న తన కుమారుడికి మద్దతుగా రస్ అల్ ఖైమాకు వచ్చిన ఆమె, తొలిసారిగా అక్కడి బీచ్‌ను సందర్శించారు. సముద్రపు స్వచ్ఛమైన నీరు, మెత్తటి ఇసుక, ఆహ్లాదకరమైన వాతావరణం తనను ఆకట్టుకున్నాయని చెప్పారు.
10కి పైగా జాతీయ జట్లు పాల్గొన్న ఈ క్రీడా పోటీలు బీచ్‌ల మూసివేత కారణంగా రద్దవుతాయేమోనని తొలుత ఆందోళన చెందామని, అయితే అనుకున్న దానికంటే త్వరగా బీచ్‌లు తెరుచుకోవడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. తన పిల్లలకు సముద్రం అంటే ఎంతో ఇష్టమని, ఈసారి బీచ్‌ను చూసి వారు చాలా సంతోషించారని చెప్పారు. ఇకపై కనీసం నెలకు ఒక్కసారైనా కుటుంబంతో కలిసి ఇక్కడికి రావాలని భావిస్తున్నట్లు జలీలా వెల్లడించారు.
మరోవైపు, బీచ్‌లు తిరిగి తెరుచుకోవడంతో షార్జా, రస్ అల్ ఖైమా తీర ప్రాంతాల్లో పర్యాటక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. శీతాకాలపు ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ విహారాలు, క్రీడలు, వ్యాయామాలతో బీచ్‌లు మళ్లీ సందడిగా మారుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో వ్యవసాయ ఉత్పత్తి 12.65 శాతం తగ్గుదల..!!
- ఒమన్‌లో ఆహార భద్రతకు భారీ ప్రోత్సాహం..!!
- ఖతార్ – టర్కియే మధ్య కీలక రక్షణ ఒప్పందం..!!
- షార్జా, రస్ అల్ ఖైమా బీచ్‌లలో సందర్శకుల సందడి..!!
- సౌదీ అరేబియా విమాన సర్వీసుల నిలిపివేతను పొడిగించిన ఎయిర్ ఇండియా, ఇండిగో
- నాలుగు గంటలకు పైగా నిలిచిపోయిన అమెరికా విమాన సర్వీసులు..
- ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ దేశాలపై 7,000కు పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు: జీసీసీ ప్రధాన కార్యదర్శి
- సీఐఐ సదస్సు విజయవంతం..
- కొత్తగూడెం విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ !
- బాధ్యులను జవాబుదారీగా నిలపాలని కోరింది.







