ఫ్రాన్స్ కోకా కోలా ప్లాంట్ లో 370 కిలోల కొకైన్!
- September 01, 2016
కోకా కోలా ప్లాంట్ లో 370 కిలోల కొకైన్ బయటపడటం ఫ్రాన్స్ లో కలకలం రేపింది. దక్షిణ ఫ్రాన్స్ లోని సైనెస్ వద్ద గల కోకా కోలా ప్లాంట్ లో ఓ కంటెయినర్ లో ఉన్న ఈ కొకైన్ ను అక్కడి కార్మికులు గుర్తించారు. దక్షిణ అమెరికా నుంచి వచ్చిన ఆరెంజ్ జ్యూస్ సంబంధిత కంటెయినర్ లో దాచిన కొకైన్ బ్యాగులను గుర్తించినట్లు మీడియా సంస్థ 'ఇండిపెండెంట్' బుధవారం వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో కొకైన్ బయటపడటం ఫ్రాన్స్ చరిత్రలోనే ఇది మొదటిసారి. దీని విలువ 50 మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ కొకైన్ వ్యవహారంలో కోకా కోలా ప్లాంట్ వర్కర్ల పాత్ర లేదని తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని విచారణ అధికారి జీన్ డెనిస్ మల్ గ్రాస్ వెల్లడించారు.
కొకైన్ ను ఎవరు, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు.. అది కంటెయినర్ లోకి ఎలా వచ్చింది అనే విషయాలపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







