కేజ్రీవాల్‌పై వివాదాస్పద కామెంట్స్ : వర్మ
- October 16, 2016
క్రియేటివ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన సర్కార్, సర్కార్ రాజ్ చిత్రాలు అద్భుత విజయాలు అందుకొన్నాయి. ఇప్పుడు 'సర్కార్-3'ని రూపొందించే పనిలో ఉన్నారాయన. ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారో వారి పాత్రల పేర్లతో సహా వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పనిలో పనిగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు.
అమితాబ్ బచ్చన్: సుభాష్ నాగ్రే పాత్రలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
యామీ గౌతమ్: తండ్రిని చంపిన సర్కార్‌పై పగతీర్చుకునే యువతి అన్ను కర్కారే పాత్రలో నటిస్తోంది.
మనోజ్ బాజ్‌పాయ్: గోవింద్ సర్కార్‌కి శత్రువుగా గోవింద్ దేశ్‌పాండే పాత్రలో నటిస్తున్నారు.
రోనిత్ రాయ్: సర్కార్‌కి కుడి భుజంగా గోకుల్ సతమ్ పాత్ర పోషిస్తున్నారు.
అమిత్ సాధ్: పొగరు, వాలటైల్ ఉండే శివాజీ అలియాస్ చీకూ పాత్రలో నటిస్తున్నారు.
జాకీ ష్రాఫ్: సర్ అనే పాత్రలో జాకీ నటిస్తున్నారు.
భరత్ దబోల్కర్: గోరఖ్ రాంపూర్ అనే మంత్రి క్యారెక్టర్ చేస్తున్నారు.
రోహిణి హట్టంగడి: రుక్కు బాయ్‌దేవి అనే విలన్ పాత్రలో రోహిణి కన్పించనున్నారు.
అయితే సినిమా స్టోరీలో చాలా మార్పులు చేయడంతో ఇందులో అభిషేక్, ఐశ్వర్యలు నటించడంలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వర్మా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ' మనోజ్ బాజపాయ్ చాలా బాగా నటిస్తున్నారు.. కానీ అరవింద్ కేజ్రీవాల్ కంటే మంచి నటుడైతే కాదు' అంటూ ట్వీట్ చేశారు వర్మ.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







