''ప్రేమమ్' సక్సెస్‌మీట్
- October 19, 2016
''ప్రేమమ్' క్లైమాక్స్‌లో శృతిహాసన్ స్వీట్ తిని చైతన్యని చూసినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. అద్భుతమైన ఫీలింగ్ అది. ఇలాంటి రీమేక్స్ చేయడానికి గట్స్ కావాలి' అని అంటున్నారు నాగార్జున. అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోహీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'ప్రేమమ్' చిత్రం ఇటీవల విడుదలైంది.ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, ''ప్రేమమ్' సినిమా చూసిన వెంటనే కచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని చందుకు కంగ్రాట్స్ చెప్పా. అన్నట్టుగానే సినిమా హిట్ కావడం ఆనందంగా ఉంది. చందు మన నేటివిటీకి తగ్గట్టుగా బాగా తీశాడు.
చాలా మంది చైతన్యతోనో, అఖిల్‌తోనే 'శివ' సినిమా తీయవచ్చు కదా అంటున్నారు. మళ్ళీ అలాంటి సినిమాను తీయలేం. నేను బాగా నటిస్తే నాన్న ఏఎన్నార్ నన్ను పొగిడేవారు కాదు. కానీ నేను చెబుతున్నాను..ఈ చిత్రంలో చైతన్య అద్భుతంగా నటించాడు. ఈ వయస్సున్నప్పుడే నాకు 'గీతాంజలి' వచ్చింది. ఆ వయసులో నేనేం చేయగలనో అది చేశాను. చైతన్య కూడా ఇప్పుడు అదే చేశాడు.ఈ చిత్రంలో సైకిల్ చైన్ డైలాగ్‌కు మంచి స్పందన వచ్చింది. చివర్లో 'కొడుకు సంతోషం కన్నా తండ్రికి ఏం కావాలి' అనే డైలాగ్ ఉంది. ఇప్పుడదనే అంటున్నాను చైతన్యకి సక్సెస్ రావడం కన్నా నాకు ఇంకేం కావాలి' అని అన్నారు. 'రీమేక్ చేయడానికి గట్స్ కావాలి.ఒరిజినల్ చిత్రంలోని సోల్ తీసుకుని చందు చాలా బాగా రీక్రియేట్ చేశాడు. నా కెరీర్‌కి బిగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రవీణ్, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మాజీ, నర్రా పాత్రల వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ బాగా పండింది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని నాగచైతన్య తెలిపారు.
దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ, 'సినిమాలో చైతన్య టీనేజ్ లుక్ చూసి ఐదు సంవత్సరాల క్రితం షూట్ చేసి ఇప్పుడు యాడ్ చేశారా అని అడుగుతున్నారు. దీనిని బట్టి చైతూ ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. అది బెస్ట్ కాంప్లిమెంట్‌గా ఫీలవుతున్నాను' అని చెప్పారు. 'రీమేక్ చేయడమంటే సాహసం.అన్ని ఏరియాల నుంచి సినిమాకి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం పది రోజుల్లో 21 కోట్ల షేర్ సాధించింది. మూడవ వారంలో మరికొన్ని థియేటర్లు పెంచుతున్నాం. కేరళలో కూడా సినిమాను విడుదల చేశాం.
అక్కడ కూడా మూడు షోలు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్నాయి' అని సమర్పకులు పి.డి.ప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







