చల్ చల్ గుర్రం ఈ నెల 28న విడుదల...
- October 20, 2016
ఎం.ఆర్.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనా రా§్‌ు హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం చల్ చల్ గుర్రం. మోహన ప్రసాద్ దర్శకత్వంలో రాఘవయ్య నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 28న విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..దర్శకుడు మోహన ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 28న విడుదల చేస్తున్నాం. కొత్త కాన్సెప్ట్‌ను యంగ్‌టీంతో కలిసి చేశాం. టైటిల్‌కు అనుగుణంగానే సినిమా ఫన్ ఎంటర్‌టైనర్. సినిమాలో ఏ పాత్ర మధ్య రిలేషన్ ఉండదు. అలా ఏ రిలేషన్ లేని 36 పాత్రల మధ్య నడిచే చిత్రమిది. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు తెలుగులో సినిమా రాలేదు.ఈ నెల 28న విడుదలవుతున్న మా చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. హీరో శైలేష్ మాట్లాడుతూ.. ముకుంద సినిమా తర్వాత చిత్ర దర్శకుడు మోహనప్రసాద్‌గారు, నిర్మాత రాఘవయ్యగారు వచ్చి నన్ను కలిసి ఈ కథను చెప్పారు. కథ నచ్చడంతో సినిమాలో నటించడానికి అంగీకరించాను.మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ. సినిమా చాలా బాగా వచ్చింది. అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ నెల 28న సినిమా విడుదలవుతుంది.సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







