'బాహుబలి 2' సెట్‌కు వెళ్ళిన చిరు...
- October 21, 2016
మెగాస్టార్ చిరంజీవి 'బాహుబలి 2' షూటింగ్ సెట్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. 'బాహుబలి' ప్రభాస్, దర్శకుడు రాజమౌళి ఆప్యాయంగా ఆయనను ఆహ్వానించారు. సినిమా విశేషాలను చిరు అడిగి తెలుసుకున్నారు.చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150', 'బాహుబలి 2' సినిమాల షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. ఈ విషయం తెలిసి చిరంజీవి తన సెట్ నుండి ప్రత్యేకంగా 'బాహుబలి 2' సెట్‌కు వెళ్ళి కొద్దిసేపు గడిపారు.గతంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన 'మగధీర' చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించన విషయం తెలిసిందే. అంతేకాదు సూపర్‌హిట్ మూవీ 'ఘరానా మొగుడు' పాటని ఇందులో రాజమౌళి రీమిక్స్ చేశారు.ఆ పాటలో కొద్దిసేపు కనిపించిన చిరంజీవి డాన్స్ కూడా చేశారు. మళ్ళీ చిరంజీవి, రాజమౌళి కలయికలో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







