దీపావళి కానుకగా 'భైరవ' సినిమా టీజర్ విడుదల..
- October 28, 2016
కలెక్షన్ల పరంగా ప్రతీ సినిమాకు కొత్త రికార్డును సృష్టిస్తున్నారు 'ఇలయ తలబది' విజయ్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న కొత్తచిత్రం 'భైరవ'. విజయా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి కానుకగా విజయ్ తన అభిమానుల కోసం 'భైరవ' సినిమా టీజర్‌ను విడుదల చేశారు. 1.07 నిమిషాల పాటు సాగే ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 'నీఎన్న వసూల్ మన్ననా?'(నువ్వేమైనా కలెక్షన్ కింగా?) అని విలన్ అడగ్గా.. 'ఆమా వెలియ అప్పడిదా పేసికిరాంగ' (అవును బయట అలాగే మాట్లాడుకుంటున్నారు) అని విజయ్ చెప్పే డైలాగును ఈ టీజర్ చివర్లో ప్రస్తావించారు.
మొత్తానికి సినిమాపై కలెక్షన్ల పరంగా చిత్రయూనిట్ పెద్దఎత్తున అంచనాలు పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. 'కత్తి', 'తుప్పాక్కి' సినిమాలతో రికార్డులు సృష్టించిన విజయ్.. ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను సృష్టిస్తారో వేచిచూడాలి.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







