దీపావళి సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు : షారుక్
- October 31, 2016
బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుక్.. సైనికులకు ఓ చక్కటి కవితా సందేశాన్ని పంపాడు. దీపావళి సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలుపుదామంటూ ప్రధాని మోదీ పిలుపుతో సందేశ్ టు సోల్జర్స్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఓ ఉద్యమంలా నిర్వహించిన సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్ ప్రముఖులు అందులో చేరి తమ సందేశాలు పంపారు. తాజాగా షారుక్ ఖాన్ ట్విట్టర్ ద్వారా కవితాత్మకమైన పదాలతో సందేశం పోస్ట్ చేశారు.
'మన పాదాలు తివాచీలపై. వారి బూట్లు మట్టిపై. మన జీవితాలు సాధారణంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ వారి ముందు రోజుకో కొత్త సవాలు.. ఒత్తిడి ఉంటుంది.
వారు మనల్ని కాపాడుతున్నారు కాబట్టే మనం జీవిస్తున్నాం. మన హీరోల త్యాగాలు ప్రపంచానికి తెలీకుండా ఉండకూడదు. ఎందుకంటే మనల్ని కాపాడడానికి వారు పడే బాధేంటో మనం వివరించలేం. వారి వల్లే దేశం, మనం..సురక్షితంగా ఉన్నాం. కాబట్టి మా ప్రియమైన సైనికులారా.. మీకు, మీ కుటుంబానికి మరోసారి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు'' అంటూ శుభాకాంక్షలు తెలిపాడు షారుక్.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







