కమల్ హసన్ నుంచి విడిపోతున్నానంటున్నగౌతమి
- November 01, 2016
ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్ నుంచి విడిపోతున్నానని నటి గౌతమి ప్రకటించింది. దీంతో 13ఏళ్ల వీరి సహచర్యానికి తెరపడింది. 13 ఏళ్ల పాటు సాగిన తమ సహజీవనానికి వీడ్కోలు పలుకుతున్నట్లు గౌతమి కొద్దిసేపటి క్రితమే స్వయంగా ప్రకటించారు. సినీ పరిశ్రమకు రాకముందే కమల్ తన కలల హీరో అని, కమల్ హాసన్ సహచర్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గౌతమి తెలిపారు. ఇది తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 1998లో గౌతమి వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహమాడారు. వీరికి పుట్టిన కూతురే సుబ్బులక్ష్మి. పెళ్లైన ఏడాదికే భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అనంతరం 2003 నుంచి కమల్‌తో సహజీవనం చేశారు. తెలుగులో 'విచిత్ర సోదరులు' చిత్రం నుంచి కమల్, గౌతమిల స్నేహం చిగురించింది. తమ సహజీవనం గురించి గతంలో వీరు మాట్లాడుతూ 'వివాహ బంధంపై తమకు అంత విశ్వాసం లేకపోవడం వల్లే సహజీవనం చేస్తున్న'ట్లు తెలిపారు. 35 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్‌కు గురైన గౌతమి అతి కష్టం మీద ఆ వ్యాధిని జయించారు. ఈ సమయంలోనేగాక గౌతమికి పలు విపత్కర సందర్భాల్లో కమల్ అండగా నిలిచారు. పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టిన గౌతమి... విశాఖపట్నంలోని గీతం కాలేజీలో ఇంజనీరింగ్ చదివారు. గౌతమి మొట్టమొదటిసారిగా నటించిన చిత్రం 'దయామయులు'. ఈ సినిమా 1987లో విడుదలైంది. అక్కడి నుంచి ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. తాజాగా మలయాళ స్టార్ మోహన్‌లాల్ సరసన ఆమె 'మనమంతా' అనే సందేశాత్మక చిత్రంలో నటించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆమె నటించిన తెలుగు చిత్రం ఇది. కాగా, వీరి బంధానికి గౌతమి ఇంత అకస్మాత్తుగా గుడ్‌బై చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇందుకు గల కారణాలు ఏమిటనేది ప్రస్తుతానికి ఎవరికీ తెలియని రహస్యంగానే వున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







