త్రివిక్రమ్,పవన్‌కల్యాణ్ కొత్త సినిమా ప్రారంభోత్సవం
- November 05, 2016
పవన్ కొత్త సినిమా ప్రారంభమయింది. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఈరోజు ఉదయం 10:49గంటలకు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలోని దేవాలయంలో జరిగింది. హారిక&హాసిని క్రియేషన్ బ్యానర్‌పై శ్రీమతి మమత సమర్పణలో ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు.ఈ సినిమా నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ మాట్లాడుతూ.. తమ బ్యానర్‌లో నుంచి వస్తున్న ఈ సినిమా తమకెంతో ప్రతిష్టాత్మకమైనదని, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ చిత్రంలో పవన్ సరసన ఇద్దరు కథానాయికలు నటిస్తారని వారిని ఫైనలైజ్ చేశాక పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.ఈ చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. రావణ్, అపరిచితుడు వంటి సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ వీ మణికందన్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర్రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పీడీవీ ప్రసాద్, సమర్పణ: శ్రీమతి మమత, నిర్మాత: ఎస్ రాధాకృష్ణ, రచన&దర్శకత్వం: త్రివిక్రమ్.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







