సినిమా రికార్డులకు బ్రేక్
- November 12, 2016
ఈ మధ్య కాలంలో ఓ సినిమా హిట్టా ఫట్టా అనేది కలెక్షన్స్ బట్టే చెబుతున్నారు. ఏ సినిమా అయితే ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తోందో ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిందని లెక్కలు వేస్తున్నార. కాని ఇప్పుడు పెద్ద నోట్ల రద్ధుతో ఇలాంటి లెక్కల విషయంలో కొంత జాప్యం జరగొచ్చనే టాక్ వినిపిస్తోంది. బ్లాక్ మనీని అరికట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా నిర్మాతలు కలెక్షన్స్ విషయంలో కొంత సీక్రెట్ వహిస్తారేమో అనే టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి చిత్రంపై ఇటీవల ఐటీ రైట్స్ జరగడం కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు. ఇక నుండి స్టార్ హీరోల సినిమాలు కలెక్షన్స్, శాటిలైట్ రైట్స్ , ప్రీ రిలీజ్ బిజెనెస్ వంటి విషయాల్లో రికార్డ్ లు క్రియేట్ చేసారనే వార్తలు రాకపోచ్చు.
500, 1000 రూపాయల నోట్ల రద్దుతో సినీ పరిశ్రమలో చాలామంది ఓ విధమైన డైలమాలో పడ్డారు. సినిమా షూటింగ్ లు ఆగిపోవడం, మరో వైపు థియేటర్లకు జనాల రద్ధీ లేకపోవడంతో చిత్ర నిర్మాతలు కాస్త డిప్రెషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరి ఇకపై ఏం జరుగుతుందో చూడాలి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







