డిసెంబర్ 7న పీఎస్ఎల్వీ ప్రయోగం
- November 14, 2016
పీఎస్ఎల్వీ-సి36ను వచ్చే నెల 7న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి నింగిలోకి పంపాలని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సోమవారం షార్‌లోని కల్పనా కాన్ఫరెన్సు హాలులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాకెట్ సన్నద్ధత సమావేశం(ఎంఆర్ఆర్) నిర్వహించారు. షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్, పీఎస్ఎల్వీ ప్రాజెక్టు డైరెక్టర్, ఉపగ్రహ సంచాలకులు మహేష్‌లతోపాటు విక్రమ్ సారాభాయ్ స్పేస్‌సెంటర్ తిరువనంతపురం, ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులోని శాస్త్రవేత్తలు రాకెట్ అనుసంధానం, ఉపగ్రహ పరీక్షలపై సమీక్షించారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా డిసెంబరు 7న 10 గంటల్లోపు ప్రయోగం చేపట్టాలని నిర్ణయించారు.సమయాన్ని నిర్ధరించలేదు. పీఎస్ఎల్వీ వాహకనౌక 1225 కిలోల బరువు ఉన్న రిసోర్స్‌శాట్-2ఎ ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







