తగ్గిన ఇళ్లు, ఫ్లాట్ల ధరలు
- November 15, 2016
కేంద్ర ప్రభుత్వం రూ. 500, 1000 నోట్లను రద్దుచేయాలని నిర్ణయించడంతో దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. సాధారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కొత్త ఇళ్ల కంటే, సెకండ్ హ్యాండ్ ఇళ్ల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇలా కొనేటప్పుడు అందులో కొంత మొత్తం మాత్రమే రుణంగా తీసుకుని, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించడం సర్వసాధారణం. ఇలా నగదు రూపంలో ఇచ్చేదాన్నే 'నల్లడబ్బు'గా పరిగణిస్తారు. అయితే, ఇప్పుడు ఇలా ఇవ్వడానికి కొత్త నోట్లతో కూడిన నగదు ఎవరి దగ్గరా సిద్ధంగా లేకపోవడంతో.. కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొత్త నోట్లు ఇంకా పెద్దమొత్తంలో ఎవరికీ అందుబాటులో లేవు.నిజానికి ఏ ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలన్నా బ్యాంకులు దాని విలువ మొత్తానికి రుణం మంజూరు చేయవు. తప్పనిసరిగా కొంత మొత్తాన్ని సేవింగ్స్ లోంచి తీయాల్సిందే. ఇప్పుడు అలా తీయడానికి కూడా పరిమితులు ఉండటం, వారానికి రూ. 24 వేలకు మించి విత్‌డ్రా చేయడానికి వీల్లేకపోవడంతో అసలు ఇళ్లు/ఫ్లాట్లు కొనేవాళ్లు కనిపించడంలేదు.
ఈ పరిస్థితి పెట్టుబడిదారులతో పాటు బిల్డర్లలో కూడా తీవ్ర అయోమయం సృష్టిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ధరలు తగ్గగా.. రాబోయే ఆరేడు నెలల్లో మరింత పతనం కావడం ఖాయమని అంటున్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అంతకుముందు కంటే 25-30 శాతం తగ్గినట్లు జాతీయ రియల్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు తరుణ్ భాటియా తెలిపారు. ఇంతకుముందు జరిగిన ఒప్పందాలు కూడా రద్దవుతున్నాయి. దక్షిణ ఢిల్లీలో ఒక బంగ్లాకు ఇంతకుముందు రూ. 3.25 కోట్ల ధర పలకగా, ఒక్కసారిగా అది 2.25 కోట్ల రూపాయలకు పడిపోయిందని, మార్కెట్ తీవ్ర సంక్షోభంలో ఉందని భాటియా చెప్పారు.
పెద్ద బడ్జెట్‌తో ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేవారే ఇప్పుడు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అది కూడా ఇతర ప్రాంతాల కంటే ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లకు చెందినవాళ్లకు సమస్య మరీ ఎక్కువగా ఉందని ఫిచ్ అనే రేటింగ్ సంస్థ పేర్కొంది. ఇప్పుడు ఇక్కడ రేట్లు తగ్గడంతో పాటు లావాదేవీల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయిందని, దీని ప్రభావం పలు రంగాలపై పడుతుందని అంటున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







