హైదరాబాద్‌లో పాతనోట్ల మార్పిడికి కొత్త విధానం!
- November 19, 2016
నగర జనానికి ఓ గుడ్‌న్యూస్. రద్దీతో విసిగిపోయి బ్యాంకులు కాకుండా మరి ఇంకెక్కడైనా పాతనోట్లు తీసుకుంటే బాగుండు అని ఆలోచిస్తున్నారా?.. అయితే మీకోసమే హైదరాబాద్‌లో ఓ కొత్త పథకం అమలులోకి వచ్చింది. నగరంలోని ఎర్రగడ్డ రైతు బజార్లో కేంద్రీయ భండార్ అనే సంస్థ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎర్రగడ్డలోని రైతుబజార్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ పాత రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకొని అంతే విలువైన నిత్యావసరాలను ఇస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రైతు బజార్లపైనా తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. ఎప్పుడూ రద్దీగా ఉండే రైతు బజార్లు, కిరాణషాపులు, పండ్ల మార్కెట్లు జనాలు లేక పది రోజుల నుంచి వెలవెలబోతున్నాయి.
చిల్లర లేక, ఉన్న పాత నోట్లను మార్చుకోలేక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పడిపోవడంతో రైతుల కష్టాలు అంతాఇంతా కాదు. ఇక తోపుడు బండ్లు, రైతు బజార్లు, పాల కేంద్రాలు తదితర చిరు వ్యాపారాల పరిస్థితి దారుణం. ఈ నేపథ్యంలో కేంద్రీయ భండార్ సంస్థ ఎర్రగడ్డ రైతు బజార్లో కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టడంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాత రూ. 1000, రూ. 500 నోట్లకు నిత్యావసర వస్తువులను అందించి పాతనోట్ల మార్పిడి వెసులుబాటును కల్పించడంతో ఎర్రగడ్డ రైతుబజారులో నేటి నుంచి పాత నోట్ల మార్పిడి అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







