దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ ఖామిస్ మృతి
- November 25, 2016
జనరల్ కమాండర్ ఆఫ్ దుబాయ్ పోలీస్ - లెఫ్టినెంట్ జనరల్ ఖామిస్ మట్టర్ అల్ మజెనా గురువారం రాత్రి మృతి చెందారు. హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన్ను రషీద్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ప్రాణాల్ని కాపాడలేకపోయారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం జబెల్‌లో ఫ్యునరల్ ప్రార్థన జరుగుతుంది. అల్ కాసియాస్ సిమెట్రీలో ఆయన అంత్యక్రియల్ని నిర్వహిస్తారు 2013లో లెఫ్టినెంట్ జనరల్ అల్ మజెనా జనరల్ కమాండర్ ఆఫ్ దుబాయ్ పోలీస్‌గా ఎంపికయ్యారు. అంతకు ముందు డిప్యూటీ కమాండర్‌గా పనిచేశారాయన. దానికన్నా ముందు జనరల్ డైరెక్టరేట్ ఫర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ - దుబాయ్ పోలీస్ డైరెక్టర్‌గా మజెనా పని చేయడం జరిగింది. పోలీస్ మరియు సెక్యూరిటీ విభాగంలో అల్ మజెనా విశేషమైన సేవలు అందించారు. పోలీస్ శాఖలో 31 ఏళ్ళ సర్వీస్ ఆయన సొంతం. హై ప్రొఫైల్ కేసుల్ని చాలావరకు ఆయన పరిష్కరించారు. సోషల్ మీడియాలో మజెనా మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు నెటిజన్లు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







