'పింక్' చిత్రానికి మరో అరుదైన గుర్తింపు ...
- November 26, 2016
మహిళలపై లైంగిక వేధింపులు, ఆధునిక మహిళల పట్ల సమాజం చూపుతున్న ధోరణిని ప్రశ్నిస్తూ రూపొంది, విమర్శకుల ప్రశంసలందుకున్న 'పింక్' చిత్రానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్ 16న దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. బిగ్ బి అమితాబ్ చిత్ర కథానాయిక తరఫున వాదించే న్యాయవాది పాత్రను పోషించారు.తాప్సీ, ఆండ్రియా తరియంగ్, కీర్తి కుల్హర్లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుద్ధరాయ్ చౌధురి దర్శకత్వం వహించగా రష్మిశర్మ, శూజిత్ సర్కార్లు నిర్మాతలుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







