బంగ్లాదేశ్‌లో రోజురోజుకీ పెరుగుతున్నదాడులు
- December 04, 2016
బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దుండగులు ఈరోజు మరో దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అందులోని మూడు విగ్రహాలను ముక్కలు చేశారు. తూర్పు నెట్రొకోన ప్రాంతంలోని మైమెన్సింఘొరోహి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం పది హిందూ దేవాలయాలను దుండగులు ధ్వంసం చేసిన ఘటనను మర్చిపోకముందే తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. షరీఫ్‌పూర్ కాళీ ఆలయం తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూసిన గ్రామస్తులకు లోపల ధ్వంసమైన విగ్రహాలు కనిపించాయి. ముక్కలైన విగ్రహాల్లో ఒకటి కాళీమాత విగ్రహం కాగా మరొకటి శివుని విగ్రహం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







