హైపర్ లూప్: అబుదాబీ నుంచి అల్ అయిన్కి 8 నిమిషాల్లోనే
- December 12, 2016
హైపర్ లూప్ అందుబాటులోకి వస్తే అబుదాబీ నుంచి అల్ అయిన్కి ప్రయానం కేవలం 8 నిమిషాలు మాత్రమే ఉండబోతోంది. భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఈ హైపర్ లూప్ ప్రయానం పట్ల పలు దేశాలు ప్రత్యేకమైన దృష్టిపెట్టనున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు హైపర్‌లూప్ పట్ల ఆసక్తి చూపుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ మునిసిపల్ ఎఫైర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్‌తో కలిసి ఫీజబులిటీ స్టడీపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. అబుదాబీ అల్ అయిన్లను హైపర్‌లూప్ ద్వారా కనెక్ట్ చేయడం ఈ ఫీజబులిటీ అధ్యయనం తాలూకు ఉద్దేశ్యం. 33కి పైగా దేశాల్లో హైపర్‌లూప్ టెక్నాలజీపై పేటెంట్‌ని కలిగి ఉంది హైపర్లూప్టిటి సంస్థ. భారీ అయస్కాంత క్షేత్రాల ద్వారా ఈ హైపర్ లూప్ పనిచేస్తుంది. అత్యంత వేగంగా హైపర్‌లూప్ ప్రయాణీకుల్ని అత్యంత సమర్థవంతంగా, భద్రతతో గమ్యస్థానాల్ని చేర్చుతుంది. ఒప్పందం ప్రకారం జరిగేస్టడీలో ఏయే ప్రాంతాల మీదుగా హైపర్ లూప్ నిర్మించాలి? స్టేషన్లు ఎన్ని ఉండాలి? ఎంత ఖర్చవుతుంది? ట్రాక్‌ల నిర్మాణం ఎలా? వంటివన్నీ అధ్యయనం చేస్తారు. విమాన వేగంతో హైపర్‌లూప్ ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







