మోసం కేసులో మహిళకు జైలు
- December 12, 2016
సోమాలీ మహిళకు ఏడాది జైలు శిక్ష అలాగే, శిక్ష అనంతరం డిపోర్ట్ చేయాలంటూ దోహాలోని క్రిమినల్ కోర్ట్ తీర్పునిచ్చింది. ఓ ట్యాక్సీ డ్రైవర్ని వంచించిన కేసులో ఆమెకు ఈ శిక్ష విధించింది న్యాయస్థానం. దోహాలోని అల్ సద్ ప్రాంతంలో నిందితురాలు, ఓ ట్యాక్సీని ఆపగా, ఆ ట్యాక్సీ డ్రైవర్ ఆమెను గమ్యస్థానానికి చేర్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే తాను ఓ పోలీస్ అధికారినని పేర్కొంటూ, కారుకి సంబంధించిన పత్రాలు కావాల్సిందిగా ఆమె డిమాండ్ చేసింది. తనవద్దనున్న పత్రాల్ని చూపించిన డ్రైవర్ ఇంకొన్ని పత్రాలు, కంపెనీ వద్ద ఉన్నాయని చెప్పగా, అతన్ని బెదిరించి అతని నుంచి 400 ఖతారీ రియాల్స్‌ని కాజేసింది. అనంతరం వేరే ప్రాంతానికి కారుని పోనిచ్చి, అక్కడ ఆమె దిగిపోయింది. ట్యాక్సీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు విచారించిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి, న్యాయస్థానానికి తరలించారు. అయితే తొలుత తాను ఆ నేరం చేయలేదని నిందితురాలు ఎదురుతిరిగినా, చివరకు నేరం ఒప్పుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







