అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం: నలుగురికి గాయాలు
- December 13, 2016
అబుదాబీ: షేక్ రషీద్ బిన్ సయీద్ స్ట్రీట్‌లోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో నలుగురు గాయపడ్డారు. అబుదాబీ సివిల్ డిఫెన్స్, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, అగ్ని కీలల్ని నియంత్రించాయి. ఇతర ప్రాంతాలకు మంటలు విస్తరించకుండా సిబ్బంది అడ్డుకున్నారు. మధ్యాహ్నం 2.12 గంటల సమయంలో సమాచారం అందుకున్న వెంటనే సివిల్ డిఫెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుందని, సహాయక చర్యల్ని ముమ్మరం చేసిందని అబుదాబీ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ జలీల్ అల్ అన్సారీ చెప్పారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదాల్ని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







