తగ్గుతున్న బంగారం ధరలు
- December 15, 2016
అంతర్జాతీయ పరిస్థితులకు తోడు స్థానిక బులియన్ మార్కెట్లోనూ మదుపర్లు అమ్మకాలు కొనసాగించడంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏడాది తర్వాత అమెరికాలో ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడమూ ఇందుకు దోహదపడింది.
కొనుగోళ్ల మద్దతు లేకపోవడంతో కిలో వెండి ధర రూ.1,410 తగ్గి రూ.41,000 కిందకి దిగొచ్చింది. 99.5% స్వచ్ఛత గల ప్రామాణిక బంగారం 10 గ్రాముల ధర బుధవారం ముగింపు రూ.27,900 నుంచి రూ.550 తగ్గి రూ.27,350కు చేరుకొంది. మరోవైపు 99.9% స్వచ్ఛమైన బంగారం ధర రూ.28,050 నుంచి 27,500కు చేరుకొంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో పసిడి ఫిబ్రవరిలో నమోదైన కనిష్ఠ ధరకు దిగి రాగా డాలర్ 14 ఏళ్ల గరిష్ఠానికి చేరుకొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







