బీఎస్ ఎన్ఎల్ బంపర్ ఆఫర్
- December 16, 2016
జియో షాక్ తో ఎయిర్ టెల్, వొడాఫోన్ దిగొచ్చి, అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను వినియోగదారుల ముంగింట్లోకి తెచ్చాయి. వీటి బాటలోనే తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు పరిమిత ఉచిత డేటాతో కూడిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం తెలిపింది. దీనికోసం కేవలం రూ.99తో రీఛార్జ్ చేపించుకుంటే చాలని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. రూ.99తో రీచార్జ్ చేపించుకుంటే నెల రోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్ , బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చని, వాటితో పాటు 300 ఎంబీ డేటా కూడా ఉచితంగా అందుబాటులో ఉంచుతామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ రేట్ కోలకతా టీడీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖాండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, రాజస్తాన్ లు నెట్ వర్క్ పరిధిలోని కాల్స్ కు అందుబాటులో ఉంటుంది. ఇదే ఆఫర్ ఇతర సర్కిళ్లలో రూ.119 నుంచి రూ.149కు కల్పిస్తామని కంపెనీ పేర్కొంది. అదేవిధంగా కొత్త కోంబో ఎస్టీవీ ఆఫర్ ను కూడా కంపెనీ తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద రూ.339కు నెలరోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ ను బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్ వర్క్ కైనా చేసుకునేలా అవకాశం కల్పిస్తూ 1జీబీ డేటాను అందుబాటులో ఉంచింది.. 30 రోజుల వాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే అపరిమిత 3జీ సర్వీసులను రూ.1099కు అందిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







