జనవరి 11న రానున్న 'ఖైదీ నెం-150'
- January 03, 2017
చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నంబర్ 150'ను జనవరి 11న విడుదల చేస్తున్నట్టు హీరో రామ్చరణ్ ప్రకటించారు. బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' కంటే ఒకరోజు ముందే తమ సినిమా విడుదల చేస్తున్నామని తెలిపారు. దీనికి గల కారణాలను వివరిస్తూ ఫేస్ బుక్ లో వీడియో పెట్టారు.
'గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా 12న విడుదలవుతోంది, ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల కావడం మంచి పరిణామం కాదని నాతో నాన్న అన్నారు. అందుకే ఒకరోజు ముందుగానే జనవరి 11న మా సినిమా విడుదల చేస్తున్నాం. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రావడమన్నది సహజమే' అని రామ్చరణ్ పేర్కొన్నారు.
ప్రీరిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానిస్తారా అని అడగ్గా...పిలవడానికి ఆయనేమీ పిల్లడు కాదని వ్యాఖ్యానించారు. పవన్ కు ఇన్విటేషన్ ఇస్తానని, అది తన బాధ్యత అని అన్నారు. రావడం, రాకపోవడం అన్నది ఆయన ఇష్టమని చెప్పారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







