అనప బర్ఫీ..
- January 03, 2017
కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము- 1/2 కేజీ, నెయ్యి- 1 టేబుల్ స్పూను, పంచదార- 3/4 కప్పు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, బాదం తురుము- 4 టీ స్పూన్లు, పచ్చి కోవా/పనీర్/కాటేజ్ చీజ్- 1/4 కేజీ
తయారీ విధానం: బాణలిలో నెయ్యి వేడి చేసి సొరకాయ తురుమును వేసి వేగించాలి. పదార్థం నుంచి నీరు విడుదలవుతుండగా పంచదార వేసి బాగా కలపాలి. మంట మధ్యస్థంగా ఉంచి నీరంతా ఆవిరి అయ్యే వరకూ కలుపుతూ వేగించాలి. తరువాత పనీర్/ కోవా/ కాటేజ్ చీజ్ల్లో ఏదో ఒక దానిని వేసి కావాలనుకుంటే గ్రీన ఫుడ్ కలర్ కూడా వేసుకుని బాగా కలిపి మరో ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. ఆ తరువాత యాలకుల పొడి, బాదం తురుము వేసి కలిపి పదార్థాన్నంతా నెయ్యి రాసిన పళ్ళెంలో సమానంగా పరచి ఆరిన తరువాత ముక్కలు కోయాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







