వోడాఫోన్ సూపర్ హవర్ ఆఫర్
- January 07, 2017
రిలయన్స్ జియో నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవడానికి ఇతర నెట్‌వర్క్‌లు జనాకర్షక ప్లాన్స్ ప్రకటిస్తుంటే, వొడాఫోన్ కూడా వారి దారిలోనే నడుస్తోంది. ఇప్పటికే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ ప్రకటించిన వోడాఫోన్ మరిన్ని సరికొత్త ప్యాక్‌లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వోడాఫోన్ తాజాగా ప్రిపెయిడ్ కస్టమర్ల కోసం 'సూపర్ అవర్' పేరిట ఒక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో రూ. 16, రూ. 7, రూ.5 ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ''రూ. 16తో రిచార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు అన్‌లిమిటెడ్ 3జీ/4జీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్యాక్‌తో రిచార్జ్ చేసుకుంటే ఫుల్ స్పీడ్‌తో ఒక గంటలోపు ఎంతైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అంతేకాదు ఒక రోజులో ఎన్నిసార్లయిన రిచార్జ్ చేసుకోవచ్చు(24 గంటల్లో 24 సార్లు). ఈ వన్ అవర్ ప్లాన్లతో ఎవ్రీ అవర్ సూపర్ అవర్ అవుతుంది'' అని వోడాఫోన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సందీప్ కటారియా అన్నారు. అయితే సర్కిల్‌ను బట్టి ప్లాన్ రేటు మారుతుందని తెలిపారు. అంతేకాదు రూ.5తో రిచార్జ్ చేసుకుంటే ఒక గంటపాటు అన్‌లిమిటెడ్ 2జీ డేటా, రూ.7తో రిచార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు వోడాఫోన్ టూ వోడాఫోన్ అన్‌లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లను ఈరోజు అధికారికంగా లాంఛ్ చేయనున్నారు. అయితే ఈనెల 9వ తేదీ నుంచి ప్లాన్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్ బిహార్-జార్ఖాండ్, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్, పంజాబ్-హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సర్కిల్స్‌లో మాత్రం అందుబాటులో ఉండదని వోడాఫోన్ కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







