తొలి ప్రయత్నం లోనే నిర్మాతగా చెర్రి ఘనవిజయం..
- January 17, 2017
చెర్రి లో చాలా మార్పు వచ్చింది. ఆయన సినీ ప్రవేశం సమయంలో మెగాస్టార్ కుమారుడుగా మాత్రమే తన ఉనికిని చాటు కున్నాడు. ఆయన నటుడిగా నిజంగా పరిణితి చెందిన సినిమా "ధృవ" మాత్రమే. "మగధీర రాజమౌళి సినిమా" నే. మిగిలిన అంతకు ముందు వచ్చిన సినిమాలు చిరంజీవి కొడుకుగా ఆయన శైలి అనుసరించటం లోనే కాలం గడిచింది.
అయితే ఒక సినిమా నిర్మాతగా రాం చరణ్ తొలిప్రయత్నంలో పొందిన విజయం కొంతకాలం వరకు అనితర సాధ్యమే.
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం 150' భారీకలెక్షన్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసింది. సొంత బ్యానర్ కొణిదల ప్రొడక్షన్స్‌పై తొలి చిత్రంగా నిర్మించి విజయం సాధించినందుకు చెర్రీని ప్రశంసలతో అభిమానులు ముంచెత్తుతున్నారు.
మొదటి రోజు వసూళ్ళు (11.01.2017) టాలీవుడ్ చరిత్రలో విడుదలైన సినిమాల తొలిరోజు వసూళ్ళను "బ్రేక్" అత్యధిక తొలిరోజు వసూళ్ళు సాధించిన తెలుగు చిత్రంగా చెప్పవచ్చు. అలాగే దేశం మొత్తం మీద తొలిరోజు కలక్షన్లలో (8) వ ఉన్నత స్థానం వసూళ్ళు సాధించింది. వారం రోజుల్లోనే "100 కోట్ల మార్క్" ను చేదించింది.
దీనితో పోటాపోటీగా విడుదలైన "అమరావతిని రాజధానిగా చేసుకుని భారతవర్షము లో అధికభాగం తనపాలనలోకి తెచ్చుకుని పాలించిన శాతకర్ణి కథగా చెప్పబడి ఆంధ్ర శాతవాహనుల చారిత్ర చిత్రంగా" శాలివాహనుల కథను కలిపేసి వక్రీకరించి తీసిన సినిమా - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ చేసిన అధికార అనధికార సినిమా "గౌతమిపుత్ర శాతకర్ణికి అన్యాయంగా వినోదపన్ను రద్దుచేసి నా - పోటీ సినిమా లాగా మార్కెటింగ్ కు అవకాశం ప్రభుత్వం ఇవ్వకపోయినా - తానేమిటో తన సత్తా యేమిటో నిరూపించుకున్న కథానాయకుడు చిరంజీవి దశాబ్ధం అనంతరం పునఃరాగమన సినిమా నిర్మించిన అంతే శక్తివంతంగా విడుదలచేసి వసూళ్ళు రాబట్టటం రాంచరణ్ నిర్మాతగా విజయం సాధించటం ప్రమోదంగా, ప్రధానంగా చెప్పవచ్చు.
వసూళ్ళు ఒక దర్శకత్వ విలువలతో కూడిన చారిత్రాత్మక (నిజంగా కల్పితం) కథ తో పోటీ బడి ఒక ఫార్ములా సినిమా (జష్ట్ రిమేక్) విజయవంతమైంది అంటే ఒక అద్భుతమే. ఇది కధానాయక నిర్మాతల విజయమే.
ఈ సినిమా మొదటి షో నుండే మంచి రెస్పాన్సుతో కలెక్షన్ల పరంగా పాత రికార్డుల్ని కొల్లగొట్టి సినీ చరిత్రలో సంచలనాలను తెరలేపుతుండటంతో చరణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌లో కూడా ఖైదీ 150 ప్రీమియర్ కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో వసూలయ్యాయి. తన మొదటి సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకుగాను నిర్మాతగా తనకు చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ మెగా అభిమానులకు, ప్రేక్షకులకు చెర్రీ ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి రెమ్యునరేషన్ మినహాయిస్తే ఈ సినిమాకి ఖర్చైన బడ్జెట్ దాదాపు రూ. 30 కోట్లు.
విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 'ఖైదీ 150' రూ 47 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో చరణ్ నిర్మాతగా మొదటి సినిమాతోనే భారీ లాభాలను సాధించాడు. అంతేకాక ఈరోజు నుండి సంక్రాంతి పండుగ ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో కూడా కలెక్షన్లు భారీగానే కొనసాగే అవకాశముంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







