నాకున్నంత మంది అభిమానులు వేరే ఏ హీరోకీ లేరు : బాలయ్య
- January 23, 2017
బాలకృష్ణ వందో సినిమా "గౌతమి పుత్ర శాతకర్ణి" సంక్రాంతి కానుకగా రిలీజై సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలయ్య యూఎస్ లో పర్యటిస్తున్నారు.. అక్కడ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ బాలయ్య "అభిమానులే నా బలం.. వారే నన్ను నడిపిస్తారు... నాకున్నంత మంది అభిమానులు వేరే ఏ హీరోకీ లేరు.." వేరే వారికి అభిమానులు ఉండవచ్చు.. కానీ నా అభిమానుల్లా రిజిస్టర్డ్ అభిమానులు కారు అని వ్యాఖ్యానించారు.. అంతేకాదు... నాకు మొత్తం 4500 పైగా అభిమాన సంఘాలున్నాయి.. ఈ స్థాయిలో అభిమాన సంఘాలు ఎవరీ ఉండరు అని బాలయ్య తెలిపారు.. ఇక నుంచి బాలకృష్ణ ని కొత్తగా చూడబోతున్నారని.. గతంలో కొన్ని సినిమాలు ఇష్టం లేకపోయినా చేశానని.. ఇక నుంచి అలా చేయనని తన సినిమాలు ఆ సినిమాల్లో పాత్రలు స్పెషల్ గా ఉంటాయని చెప్పారు.. యూఎస్ లో ఎక్కడ పర్యటించినా తనకు తెలుగు స్టేట్ లా ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







