'మంచు' ఫ్యామిలీ దండయాత్ర!...
- January 23, 2017
కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న 'మంచు' కుటుంబం వచ్చే నెలలో తన ప్రతాపాన్ని చూపడానికి సిద్ధమైపోతోంది. బాక్సాఫీస్‌పై 'మంచు'వారి దండయాత్ర మొదలవబోతోంది. గతేడాది మంచు విష్ణు, మనోజ్, లక్ష్మిలకు కొన్ని నిరాశాజనకమైన ఫలితాలు ఎదురయ్యాయి. దీంతో వారు 2017లో తమ సత్తా చాటడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముగ్గురూ ఒక నెలలోనే థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. రాజాకిరణ్ దర్శకత్వంలో మంచు విష్ణు నటించిన చిత్రం 'లక్కున్నోడు'. హన్సిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఢీ' తరహాలో విష్ణుకు మరో విజయాన్ని అందిస్తుందని నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్.
ఇక, ఆ తర్వాత వారం మంచు మనోజ్ 'గుంటూరోడు'గా అభిమానులను పలకరించనున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తోనే మాస్ ప్రేక్షకులను అలరించిన 'గుంటూరోడు' ఫిబ్రవరి 10న థియేటర్లలోకి రానున్నాడు. ఇక, మంచు లక్ష్మి లీడ్ రోల్‌లో నటించిన 'లక్ష్మీబాంబ్' కూడా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా మూణ్నెళ్ల కిందటే రావాల్సింది.
కానీ, నోట్ల రద్దు, పెద్ద సినిమాల విడుదల వంటి కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మరి, ఫిబ్రవరి నెల మంచు ఫ్యామిలీకి ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







