సమర భేరి మోగించిన పవర్ స్టార్...
- January 23, 2017
జనసేన అధినేత పవన కళ్యాణ తనదైన శైలిలో ప్రత్యేక ఉద్యమ పోరుకు మరింత పదును పెడుతున్నారు. ప్రత్యేక హోదా సాధనకు సిద్ధమవుతున్నారు. ట్విట్టర్ వేదికగా మరోసారి సమర భేరి మోగించారు. జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో..కేంద్రం మెడలు వంచేందుకు సిద్ధం కావాలని పిలుపునివ్వడంతో పాటు .. జనసేన నిరసనను మ్యూజికల్ అల్బం ద్వారా వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా నినాదాన్ని ప్రజల్లో బలంగా నాటేందుకు ఈ ఆల్బమ్ ను విడుదల చేస్తున్నట్టు తన ట్విట్టర్లో ప్రకటించారు.
ఇచ్చిన మాట నిలబెట్టు కోకపోతే, తిరగబడతామని తెగేసి చెబుతున్న పవర్ స్టార్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 26న విశాఖ ఆర్కేబీచ్ లో జరగబోయే నిరసన కార్యక్రమానికి ప్రతీ ఆంధ్రుడు ఓ సైనికుడై కదలి రావాలన్నారు.
అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆల్బమ్ ద్వారా జనసేన గళాన్ని వినిపించిననున్నట్లు పవన్ తన ట్వీట్ లో తెలిపారు. జనసేన యూట్యూబ్ చానల్ ద్వారా ఒక మ్యూజిక ఆల్బంను రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి దేశ్ బజావ్ అనే నినాదంతో ఒక పోస్టర్ ను కూడా పవన్ పోస్ట్ చేయడం విశేషం.
తమిళనాట జల్లికట్టు ఉద్యమం సాధించిన స్ఫూర్తితో ముందుకు కదలాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. శాంతియుత ఆందోళనలకు సిద్ధం కావాలని కోరారు. తొలుత ఫిబ్రవరి 5న ఆల్బమ్ విడుదల చేయాలని భావించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనవరి 24నే విడుదల చేయబోతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







