సునీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి
- February 13, 2017
సునీల్ కథానాయకుడిగా ఎన్.శంకర్ దర్శకత్వంలో మలయాళం హిట్ సినిమా "2 కంట్రీస్"కు రీమేక్ గా తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల కేటీయార్ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 15 నుంచి మొదలవ్వనుంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ.. "మలయాళంలో దాదాపు 55 కోట్ల రూపాయలు వసూలు చేసిన సూపర్ హిట్ చిత్రం "2 కంట్రీస్". ఆ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సునీల్ సరసన కథానాయిక ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తాం. మాగ్జిమమ్ షూటింగ్ మొత్తం అమెరికాలో ప్లాన్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో కొద్దిగా మార్పులు చేశాం. మలయాళ వెర్షన్ కు సంగీతాన్ని సమకూర్చిన గోపీసుందరే తెలుగు వెర్షన్ కూ సంగీతం సమకూర్చనున్నాడు. శ్రీధర్ సీపాన సంభాషణలు సమకూర్చనున్నారు" అన్నారు.
నరేష్, సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, పృధ్వీ, శ్రీనివాస్ రెడ్డి, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, మాటలు: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, సంగీతం: గోపీసుందర్, కళ: ఏ.ఎస్.ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి రమణ, నిర్మాణం-చిత్రానువాదం-దర్శకత్వం: ఎన్.శంకర్.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







