సౌదీలో మహిళలకు జిమ్ కు వెళ్ళటానికి అనుమతి
- February 14, 2017
బరువు తగ్గేందుకు, ఫిట్‌గా ఉండేందుకు ఆడవారిని జిమ్ములకు అనుమతించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. అది కూడా కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిమ్ములకు మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. వాలీబాల్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ క్రీడలకు మాత్రం అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఆరోగ్యం కోసం పరుగెత్తడానికి, ఈత కొట్టడానికి మహిళలకు ఇప్పటికే అనుమతి ఉంది. టెన్నిస్‌పై ఇప్పటికీ నిషేధం కొనసాగించడం పట్ల సౌదీ మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక మహిళా జిమ్ములకు వెళ్లేందుకు సౌదీ మహిళలను అనుమతిస్తున్నట్లు దేశ ఉపాధ్యక్షులు, మహిళా వ్యవహారాల శాఖ మంత్రయిన రాకుమారి రీమాబింత్ బండర్ ప్రకటించారు.
ఇందుకోసం మహిళా జిమ్ములను ఏర్పాటు చేసేందుకు ఇష్టమున్నవారు ఈ నెలాఖరులోగాదరఖాస్తు చేసుకోవాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. అయితే మహిళలు మాత్రమే ఈ జిమ్ములను ఏర్పాటు చేయాలని ఆమె షరతు విధించారు. కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సమాజాన్ని ఒప్పించాల్సిన బాధ్యతను తనకు లేదని, తాను కేవలం తలుపులు మాత్రమే తెరిచానని చెప్పారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







