దర్శక ధీరుడు రాజమౌళి శివరాత్రి కానుకగా సరికొత్త పోస్టర్స్ గిఫ్ట్..
- February 24, 2017
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి 2 కు సంబదించిన సరికొత్త పోస్టర్స్ ను మహాశివరాత్రి కానుకగా ఈరోజు అభిమానులకు అందించాడు. గతం లో ప్రభాస్ , అనుష్క స్టిల్ విషయం లో నెగిటివ్ కామెంట్స్ వచ్చిన నేపథ్యం లో మరోసారి అలాంటి తప్పులు జరగకుండా చాల జాగ్రత్తగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది.
ఇక ఈ పోస్టర్ లో ప్రభాస్ , ఏనుగు ఫైకి ఎక్కి నిల్చున్నట్లు కనిపిస్తున్నాడు. కండలు తిరిగిన ధీరుడిగా ప్రభాస్ కనిపించాడు. ఇక ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ చూసి అభిమానులు మరింత సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలాగైనా అనుకున్న డేట్ కు రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ డే & నైట్ కష్టపడుతుంది.
మొదటి పార్ట్ కంటే అద్భుతంగా సెకండ్ పార్ట్ తెరకెక్కిందని , కథ , గ్రాఫిక్స్ , సాంగ్స్ ఇలా అన్ని కూడా ప్రేక్షకులను మరో లెవల్ కు తీసుకెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అంటున్నారు. ఏప్రిల్ 28 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వచ్చే నెలలో ఫస్ట్ వీక్ లో టీజర్ రాబోతుందని సమాచారం.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!
- ఒమన్‌లో 10 ఏళ్ల బాలుడు గల్లంతు..కొనసాగుతున్న గాలింపు..!!
- ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!
- కువైట్‌లో 194 మంది ప్రవాసుల డిపోర్ట్..!!
- యూఏఈలో Etisalat కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్..!!
- సౌదీ అరేబియాలో మరింత వేగంగా భద్రతాపరమన ఫిర్యాదులు..!!
- నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాల పై దాడులు.. ముగ్గురికి గాయాలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక







