అసభ్య కామెంట్లకు చెక్ వెబ్‌సైట్లలో
- February 25, 2017
గూగుల్ టూల్ తయారీ
పారిస్, ఫిబ్రవరి 25: న్యూస్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీలలో వచ్చే వార్తలపై ఇష్టానుసారం కామెంట్లు చేసేవారికి ఇక చెక్ పడనుంది. ఇటువంటి వారిని నియంత్రించేందుకు గూగుల్ కృత్రిమ మేధ(ఏఐ)తో కూడిన టూల్‌ను రూపొందించింది. సైట్లలో పోస్ట్ అయిన అంశాలపై సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ చర్చలు జరగుతుంటాయి. ఈ సమయంలో కొందరు శృతిమించి అసభ్యకరంగా, అవతలివారిని కించపరిచేలా కామెంట్లు చేస్తుంటారు. ఇది ఆయా సైట్లకు, వినియోగదారులకు ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో వీటిని ఫిల్టర్ చేసేందుకు వీలుగా 'పర్‌స్పెక్టివ్' అనే టూల్‌ను ఉచితంగా అందించనున్నట్లు గూగుల్‌కు చెందిన జిగ్‌సా టెక్నాలజీ ఇంక్యూబేటర్ ప్రెసిడెంట్ జారెడ్ కోహెన్ తెలిపారు.
గత సెప్టెంబరు నుంచే దీనిని 'ది న్యూయార్క్ టైమ్స్' వెబ్‌సైట్‌కు అనుసంధానించి ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







