హాస్య నటుడు తవకలై గుండె పోటుతో హఠాన్మరణం
- February 26, 2017
మరగుజ్జు నటుల్లో హాస్యనటుడిగా పాపులర్ అయిన తవకలై గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందారు. తవకలై వయసు 42 ఏళ్ళు... 1983 లో భాగ్యరాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన "ముందానై ముదిచ్చు" సినిమాతో కోలీవుడ్ లో నటుడుగా అడుగు పెట్టారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి అగ్రహీరోల సినిమాల్లో నటిస్తూ మంచి హాస్యనటుడిగా గుర్తింపు పొందిన తవకలై "ఆనపావం" వంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించారు.. తమిలంతో పాటు తెలుగు, మలయాళ, హిందీ, సింహళి తదితర భాషల్లో దాదాపు 490 కి పైగా సనిమాల్లో నటించిన తవకలై కు గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాలు లేవు.. దీంతో బుల్లి తెరపై అడుగుపెట్టి నటన కొనసాగిస్తున్నారు... స్థానిక వడపళని లోని మురుగన్ కోయిల్ సమీపంలో నివాసం ఉంటున్న తవకలై ఆదివారం హఠాత్తుగా గుండెపోటుకు గురై అకాల మరణం చెందారు... ఈ విషయం తెలిసిన సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నడిగర్ సంఘం సంతాపం తెలిపింది.. ఈరోజు అంత్యక్రియలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..







