ఏప్రిల్ 8న టీఎస్సార్ జాతీయ సినీ పురస్కారాల వేడుక
- March 03, 2017
హైదరాబాద్: టీఎస్సార్ జాతీయ సినీ పురస్కారాల వేడుకను విశాఖపట్నంలో ఏప్రిల్ 8న ఘనంగా నిర్వహిస్తామని టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. 2015, 2016 రెండు సంవత్సరాలకు సంబంధించి ఈ అవార్డులను అందిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో అవార్డుల కమిటీని ప్రకటించారు. చైర్మనగా సుబ్బరామిరెడ్డి వ్యవహరించే ఈ కమిటీలో తారలు జయసుధ, జీవిత, మీనా, సోషలైట్స్ శోభన కామినేని, పింకీరెడ్డి, దర్శకుడు బి. గోపాల్, నిర్మాత పొట్లూరి వి. ప్రసాద్, పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు సభ్యులుగా ఉంటారు. టి. సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత ఆధ్వర్యంలో విశాఖలోని క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ వేడుకలో ఉత్తరాది నుంచి షారుఖ్‌ఖాన్, హేమమాలిని, శతృఘ్న సిన్హా, రిషి కపూర్, మాధురీ దీక్షిత్, విద్యాబాలన్, దక్షిణాది నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ వంటి తారలు పాల్గొంటారని సుబ్బరామిరెడ్డి చెప్పారు.
''ఎస్సెమ్మెస్‌ల ద్వారా ప్రజాభిప్రాయాల్ని స్వీకరించి, జ్యూరీ ద్వారా పురస్కారాల్ని అందిస్తాం. ఈ జాతీయ పురస్కారాల ప్రత్యేకత. ఈ నెల 8 నుంచి ఎస్సెమ్మెస్ కాంటెస్ట్ మొదలవుతుంది. 2010 నుంచి అవార్డులు ఇస్తున్నాం.
ఇదివరకు మూడు అవార్డు వేడుకల్ని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించాం. ఇప్పుడు దాదాపు యాభైవేల మంది ప్రజలు పాల్గొనేలా క్రికెట్ స్టేడియంలో నిర్వహించబోతున్నాం. చాలామంది కళ్లల్లో ఆనందాన్ని చూడటం కోసమే ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నా. వాళ్ల ఆనందమే నా ఆరోగ్య రహస్యం'' అని ఆయన తెలిపారు.
ఉత్తమ హీరో, నూతన హీరో, నటుడు, చిత్రం, హీరోయిన, నూతన హీరోయిన, నటి, దర్శకుడు, సంగీత దర్శకుడు, కేరక్టర్ నటుడు, కేరక్టర్ నటి, విలన, కమెడియన, గాయకుడు, గాయని విభాగాల్లో ఉత్తమ అవార్డులను ఇస్తామన్నారు. ఉత్తమ హీరో అవార్డుకు 2015 సంవత్సరానికి ప్రభాస్ (బాహుబలి), మహేశ్ (శ్రీమంతుడు), అల్లు అర్జున్(సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి), బాలకృష్ణ (లయన్) పోటీపడుతుండగా, 2016 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్), అల్లు అర్జున్ (సరైనోడు), రామ్‌చరణ్ (ధృవ), నాగచైతన్య (ప్రేమమ్), నితిన్ (అ ఆ) పోటీలో నిలిచారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







