వెజ్ స్పానిష్ రైస్
- March 12, 2017
కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం-ఒకటిన్నర కప్పు, టమాటా-3, కాప్సికమ్-2 క్యారెట్-100గ్రా, బీన్స్-100గ్రా, పచ్చి బఠాణీలు-50గ్రా, బంగాళదుంపలు-2, ఉల్లిపాయ-1, ఛీజ్ తురుము-100గ్రా, పచ్చిమిర్చి పేస్ట్-2 స్పూన్లు, వెన్న-1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు-12, ఎండు మిరపకాయలు-4, పెరుగు-1 కప్పు, నెయ్యి-2 స్పూన్లు, గరం మసాలా-1 స్పూన్, మిరియాల పొడి-1 స్పూన్, జీడిపప్పు-50గ్రా, ఉప్పు-తగినంత.
తయారుచేసే విధానం : బాస్మతి బియ్యాన్ని ముందుగానే ఉడికించి పక్కన ఉంచుకోవాలి. కూరగాయలన్నిటినీ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. బాణలి స్టవ్‌పై ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి, తర్వాత ఎండు మిరపకాయలు-వెల్లుల్లి ముద్ద కూడా వేసి మూడు నిమిషాలు వేగించాలి. ఇందులో పెరుగు, కూరగాయ ముక్కలు, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి మరి కొంత సేపు వేగించాలి. తర్వాత వెన్న చేర్చి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచాలి. ఆఖర్న ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నం, ఛీజ్ తురుము వేసి 15-20 నిమిషాలు ఉడికించాలి. దించే ముందు పైన జీడిపప్పు చల్లాలి.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







