దుబాయ్ డ్యూటీ ఫ్రీ 1 మిలియన్ డాలర్ల బహుమతి గెల్చుకున్న భారతీయుడు
- March 15, 2017
షార్జా లో సీ పోర్ట్ వద్ద ఒక పడవ కాప్టెన్ గా విధులు నిర్వహిస్తున్న ఓ భారతీయుడికి అదృష్టం లంగరు వేసి జీవితాన్ని బంగారుమయంగా మార్చివేసింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం బి లో ప్రజల సమక్షంలో మంగళవారం ఉదయం జరిగిన ఒక డ్రా తీయగా ఫ్రాన్సిస్ జేవియర్ అరిప్పట్టుపరాంబిల్ క్లాట్స్ అనే వ్యక్తికి లాటరీ దక్కింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిల్లియనీర్ ప్రమోషన్ లాటరీలో దుబాయ్ డ్యూటీ ఫ్రీ 1 మిలియన్ డాలర్ల బహుమతి ఆయన టికెట్టుకు 238 సిరీస్ లో నెంబర్ 3133 ఆ బహుమతి వరించింది. ఆ మొత్తాన్ని ఆయన గెల్చుకున్నారు. ఈ వార్తను విన్న ఆయన తన అదృష్టానికి మురిసిపోయాడు.తన విజయం పై వార్తను విన్న తరువాత కూడా షార్జాలో తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇరువురు పిల్లలకు తండ్రిగా ఉన్న 46 ఏళ్ల క్లాట్స్ మాట్లాడుతూ , తాను ఆన్ లైన్లో టికెట్ ని కొన్నానని..ఈ బహుమతిని పొందడంతో ఈ అనుభూతిని చెప్పడానికి ఎలాంటి పదాలు లేవని తడబడ్డాడు. ఈ విజయం తనకు చాలా ఆనందంగా ఉందని ఇప్పుడు నేను నా కుటుంబంను ఇక్కడకు తీసుకుని వస్తానని సంతోషంగా తెలిపాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







