బాహుబలి 2 ట్రైలర్ రివ్యూ
- March 15, 2017
అందరికళ్లూ ఇప్పుడు బాహుబలి ది కన్‌క్లూజన్ మీదే. కట్టప్పా బాహుబలిని ఎందుకు చంపాడు ? బాహుబలి 1 రికార్డుల్ని బాహుబలి 2 ఏమేర దాటుకొంటూ వెళ్తుంది?? విజువల్‌గా రాజమౌళి ఏం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నారు? అంటూ చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలో బాహుబలి 2 ట్రైలర్ బయటికివచ్చేసింది. అదిరిపోయింది ఈ ట్రైలర్. బాహుబలి 1కీ మించి ఈ బాహుబలి 2 ఉటుందని ఈ ట్రైలర్ లో చూపించారు. బాహుబలి పార్ట్ 1లో మిస్సయిన ఎమోషన్స్ అన్నీ బాహుబలి 2లో కనిపించాయి. యుద్దాలు అదిరిపోయాయి.
విజువల్‌గా అయితే.. బాహుబలి 1తో పోలిస్తే పది రెట్లు రిచ్ గా తీర్చిదిద్దడు రాజమౌళి. తొలిభాగంలో వాటర్ ఫాల్స్, యుద్ధం, మంచు తుఫాను.. వీటిని చూపిస్తే..
సెకండాఫ్‌లో మరిన్ని అద్భుతాలు కనిపిస్తాయని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమైపోతుంది. కీరవాణి నేపధ్యం సంగీతం ఈ ట్రైలర్ ను మరో లెవల్ కు తీసుకువెళ్ళింది. వార్ ఎపిసోడ్ లో ఆయన చేసిన స్కోర్ అదరహో అనిపించింది. అనుష్క తో ఓ రొమాంటిక్ సీన్ చూపించారు.
ప్రభాస్ రానా ల మధ్య వార్ సీన్ ఆదరగొట్టాయి. టోటల్ గా బాహుబలి 2 ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగా మలిచాడు రాజమౌళి. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







