ఇవాళ ఏప్రిల్ ఫస్ట్....అల్ ఫూల్స్ డే
- March 31, 2017
ఏప్రిల్ ఒకటిన ఎవరో ఒకరిని ఫూల్ చేసి ఎవరెస్టు శిఖరం ఎక్కినంతగా సంతోషిస్తుంటాం. మనకంటే పెద్దవాళ్లను ఫూల్ చేయడానికి పేటెంట్ ఉన్న రోజు....అందరినీ ఆటపట్టించడం, సరదాగా అబద్ధాలు చెప్పి ఏడిపించడం, వేళాకోళం చేయడం ... వారు కనుక నిజమని నమ్మేస్తే వారిని మొహమాటం లేకుండా ఫూల్ అంటూ గేలిచేయడం. ఏప్రిల్ ఫస్ట్ ప్రత్యేకత. ఆల్ ఫూల్స్ డే పేరుతో దీన్ని ప్రపంచ మంతటా అనేక దేశాల్లో సరదాగా జరుపుకొంటున్నారు. ఏప్రిల్ ఒకటి. ఆల్ ఫూల్స్ డే. ఈరోజు ప్రపంచమంతా సరదా అబద్ధాల పండుగ చేసుకుంటుంది. ఎన్నో ఏళ్లుగా ఏప్రిల్ ఒకటిన ఫూల్స్ డేను జరుపుకుంటున్నా ఇప్పటికీ, అతికినట్టు చెప్పే అబద్ధాల్ని అనుకోకుండానే నమ్మేస్తాం. జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేయడంలో మీడియా, ముఖ్యంగా బ్రిటన్ మీడియా చాలా ముందుంటుంది. పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్ లో ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. నూతన సంవత్సరం ఉత్సవాలు, వసంత కాలపు సంబరాలు పదిరోజుల పాటు ప్రజలు ఆనందంగా నిర్వహించుకునేవారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఒకరికి మరోకరు బహుమతులు ఇచ్చే ఆచారాన్ని పాటించేవారు. అయితే 1582లో రాజైన చార్లెస్-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవా లని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు జనవరి ఫస్టున కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొందరు మాత్రం మొదటి నుంచీ వస్తున్న ఆచారాన్ని మార్చడానికి ఇష్టప డక జరుపుకోలేదు. వాళ్ళు మాత్రం యధా విధిగా ఏప్రిల్ 1 వరకు ఆగి ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపు కున్నారు. జనవరి ఫస్ట్‌న జరుపుకున్న వారు ఇది చూసి, ఏప్రిల్ ఫస్ట్‌న జరుపుకున్న వారిని ఫూల్స్ అని పేర్కొంటూ గేలి చేసేవారు. వాళ్ళకి తెలీకుండా పేపర్ చేపల్ని వాళ్ళ వెనక భాగాన కట్టి ఆటప ట్టించేవారు. అంతే కాకుండా వాళ్ళని గేలానికి చాలా తేలిగ్గా తెలివితక్కువతనంతో దొరికిపోయే చేపలక్రింద జమకట్టి, వాళ్ళని ఏప్రిల్ ఫిష్ అంటూ అల్లరి పెట్టేవారు.ఈ ఆటపట్టించే విధానం ఏప్రిల్ ఫూల్స్ డేగా మరో రెండు వందల ఏళ్ళకల్లా అమె రికా, బ్రిటన్, స్కాట్లండ్ తదితర దేశాలకు తెలిసిపోయింది. అలా ప్రపంచ మంతా పాకిపోయింది. ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్ వేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. అది రానురాను ప్రాక్టికల్ జోక్స్ చేసుకునే స్థాయికివెళ్ళింది. ఈ ప్రాక్టికల్ జోక్స్ మొదట్లో సున్నితంగా ఉన్నా, అప్పుడప్పుడు కాస్త శ్రుతి మించడం జరుగుతూ ఉంది. ఏదేమైనా సరదాగా, సంతోషంగా జరుపుకునే ఈ వేడుక మన దేశంలోనూ మారుమూల గ్రామాల్లోకి సైతం పాకిపోయింది.ఈ రోజు మనమంతా ఖుషీగా పండగ చేసుకోవాల్సిన రోజు. .. అదే మన ఆల్ ఫూల్స్ డే. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి, మనం ఫూలిష్ గా బతకడం లేదా?
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







