శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే చేమదుంపలు
- April 05, 2017
ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో చేమదుంపలు ఒకటి. ఇవి రుచికోసమే కాకుండా పోషకాలు కూడా అందిస్తుంది. వేపుడే కాదు పులుసు కూర కూడా చేసుకోవచ్చు. అయితే, చేమ దుంపలు వారానికి ఒకసారి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెపుతున్నారు.
ప్రధానంగా బరువు తగ్గాలనుకొనే వారు చేమ దుంపలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని సలహా ఇస్తున్నారు. దీనికి కారణం కొవ్వు శాతం తక్కువగా ఉండటమే కాకుండా సోడియం శాతం కూడా తక్కువే.
ముఖ్యంగా ఇతర కూరగాయలతో పోల్చుకుంటే చేమ దుంపల్లో కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదు. హృద్రోగాలు దరిచేరవు. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అన్నికంటే ముఖ్యంగా, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.
ఇన్ఫెక్షన్లను దరి చేరనీయదు. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరంలో పీచు, యాంటిఆక్సిడెంట్లు మాదిరి పనిచేస్తాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







