ప్రభాస్ కొత్త సినిమా 'సాహో' టీజర్ ఎప్పుడో తెలుసా ....
- April 08, 2017
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా మొదలైన ఈ సినిమా టీజర్ బాహుబలి రిలీజ్ కు ముందు రోజు అనగా ఏప్రిల్ 27 సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారట.
అంతేకాదు బాహుబలి-2 ప్రదర్శించబడుతున్న అన్ని థియేటర్స్ లో ఈ టీజర్ వస్తుందని టాక్. అయితే ఈ విషయంపై దర్శక నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. యువి క్రియేషన్స్ పతాకంలో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. తెలుగు తమిళ హింది భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారట.
బాహుబలితో నేషనల్ వైడ్ గా క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్ సుజిత్ మూవీని సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నాడట.
బాహుబలి కోసం ఏకంగా 4 సంవత్సరాల కెరియర్ కేటాయించిన ప్రభాస్ అంతకుమించిన ఇమేజ్ దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే అది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు.. అందుకే సుజిత్ ఈ సినిమాను హాలీవుడ్ సినిమా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడట.
బాహుబలి తర్వాత అదే రేంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్న ప్రభాస్ సుజిత్ సినిమా కరెక్ట్ అని ఫిక్స్ చేసుకున్నాడు. పోలీసాఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్న ఈ సినిమాలో ఫైట్స్ కేసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారట. మరి టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందని చూపించబోతున్నారట. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈ టీజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







