రాజమౌళి కొత్త సినిమా రజనీకాంత్‌తో
- April 10, 2017
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రాజమౌళి సినిమా తీయబోతున్నారన్న వార్త రజనీ అభిమానుల్లో సుడిగాలిలా వ్యాపించిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు ఈ వార్త వెలువడగానే పట్టరాని సంతోషంతో హర్షం ప్రకటిస్తున్నారని సమాచారం. 'బాహుబలి ద కంక్లూజన్' తమిళ ఆడియో విడుదల సందర్భంగా చెన్నై వెళ్లిన చిత్ర బృందం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. అలా మాట్లాడుతూ ''సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఏదో ఒకరోజు సినిమా తీస్తా'' అని తన మనసులో మాట బయటపెట్టారు. ఆదివారం రాత్రి ఈ ఒక్కమాట తమిళనాడులో పెను సంచలనమే సృష్టించింది.
బాహుబలి ది బిగినింగ్ సినిమా తమిళ సీనీ వర్గాల్లో సృష్టించిన కలకలం ఇంతా అంతా కాదు. ఒక పట్టాన ఇతర భాషా చిత్రాల ఆధిక్యతను, నాణ్యతను ఒప్పుకోవడానికి అంగీకరించని తమిళ ప్రజలు, సినీ వర్గాలు బాహుబలి తొలి భాగాన్ని చూడగానే మతులు పోగొట్టుకున్నారు. బాహుబలి పార్ట్-1 విడుదలై మంచి హిట్ టాక్ వచ్చినప్పటి నుంచి బాలీవుడ్, కోలీవుడ్ నటులతో రాజమౌళి సినిమా చేయబోతున్నారని అనేక వార్తలు, ఊహాగానాలు వచ్చాయి.
అప్పట్లోనే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌కు కాల్ చేసిన రజనీకాంత్ తనకు మంచి కథను ఇవ్వవలసిందిగా కోరినట్లు వార్తలొచ్చాయి. ఇక రాజమౌళి స్వయంగా రజనీకాంత్‌తో సినిమా తీయాలని ఉందన్న కోరికను ప్రకటించడంతో రజనీ అభిమానులు వెర్రెత్తిపోతున్నారని వార్తలు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







